కోదాడ పట్టణంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని యువతకు నియామక పత్రాలు అందజేశారు.
ఈ జాబ్ మేళాకు 53 వేల మందికి పైగా యువత నమోదు చేసుకోగా, 350 ప్రముఖ కంపెనీలు ఉద్యోగ నియామకాలకు ముందుకు వచ్చాయి. ఐటీ, ఫార్మా, తయారీ, వైద్య, బ్యాంకింగ్, రిటైల్ తదితర రంగాల్లో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం అభినందనీయమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు.
యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించి, వారి భవిష్యత్తుకు భరోసా కల్పించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు.


