- —
*గౌరవనీయులు పేదల పెన్నిధి, ఆపద్బాంధవుడు, రోడ్లు భవనాల శాఖ మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి – దండం పెట్టి చేస్తున్న విన్నపం 🙏
*విషయ: తిప్పర్తిలో 3 ఫేస్ కరెంటు 3 కోత – వరి పొలాలు ఎండిపోతున్నాయి – 15 రోజులు అదనపు కరెంటు ఇవ్వాలని వేడుకోలు*
అయ్యా,
తిప్పర్తి 3 ఫేస్ 12 గంటలు ఇస్తామని చెప్పి LC ల పేరుతో 3 గంటలు కరెంటు ఇవ్వడం లేదు.
అధికారులను అడిగితే ఆ 3 గంటలు సాయంత్రం ఇస్తామని చెప్పి మాట తప్పుతున్నారు. SE ని అడుగు అంటూ దాటవేస్తున్నారు.
*ప్రస్తుత పరిస్థితి:*
వరి చేను పొట్ట దశలో ఉంది సార్. ఫోటోలో చూసినట్లు కొన్ని పొలాలు పూర్తిగా ఎండిపోయాయి, మరికొన్ని చివరి దశలో ఎండిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. నీళ్ల పరిస్థితి తీవ్రంగా ఉంది. కనీసం 12 గంటల కరెంటు సరిగ్గా ఇస్తే మోటార్లు పోసుకుని పొలాలను కాపాడుకునే వాళ్ళం.
అధికారులు ఈ విషయాన్ని మీ వరకు తీసుకురావడం లేదు సార్, కొంతమంది కావాలనే చేస్తున్నారు.
*మా వేడుకోలు:*
దయచేసి రైతులను ఆదుకోవాలని, 15 రోజుల పాటు అదనంగా మరో 3 గంటల కరెంటు ఇప్పించి, ఎండిపోతున్న వరి పొలాలను కాపాడి రైతులకు న్యాయం చేయగలరని మీకు దండం పెట్టి కోరుకుంటున్నాము.
ఇట్లు,
*తిప్పర్తి రైతులు*
- —


