29.2 C
Hyderabad
Thursday, October 1, 2026
Homeతెలంగాణ22-ఏ భూములపై దుష్ప్రచారం వద్దు --అర్హులైన భూ యజమానుల సమస్యలను పరిష్కరిస్తాం: కాంగ్రెస్ నేతలు 
Advertisement spot_img

22-ఏ భూములపై దుష్ప్రచారం వద్దు –అర్హులైన భూ యజమానుల సమస్యలను పరిష్కరిస్తాం: కాంగ్రెస్ నేతలు 

Must read

22-ఏ భూములపై దుష్ప్రచారం వద్దు

–అర్హులైన భూ యజమానుల సమస్యలను పరిష్కరిస్తాం: కాంగ్రెస్ నేతలు

 

వరంగల్ విజయ కెరటం, సెప్టెంబర్ 19:

 

22-ఏ నిషేధిత జాబితాలోని భూముల విషయంలో బీఆర్‌ఎస్‌ నాయకులు ప్రజల్లో అపోహలు సృష్టించేలా ప్రచారం చేస్తున్నారని టీపీసీసీ అధికార ప్రతినిధి, వరంగల్–హనుమకొండ సమన్వయకర్త డా. కోటూరి మానవతారాయ్ ఆరోపించారు.శనివారం వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు మహ్మద్ అయూబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో హన్మకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఇనుగాల వెంకట్రామిరెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు.22-ఏ సమస్య కొత్తగా ఏర్పడింది కాదని, గత ప్రభుత్వాల కాలం నుంచే నిషేధిత భూముల జాబితా అమలులో ఉందని మానవతారాయ్ పేర్కొన్నారు. నిషేధిత జాబితాలో పొరపాటున చేరిన అర్హులైన ప్రైవేటు భూముల సమస్యలను నిబంధనల ప్రకారం పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. భూ భారతి ద్వారా నిషేధిత ఆస్తుల జాబితాలో చేర్చడంపై ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక సేవ అందుబాటులో ఉందని తెలిపారు.22-ఏ భూముల సమస్యను కోట్లాది మంది ప్రజల సమస్యగా చిత్రీకరించి రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నించడం సరికాదని అన్నారు. భూ రికార్డుల సమస్యలపై ప్రజలు వాస్తవాలను తెలుసుకుని, ప్రభుత్వం అందిస్తున్న ఫిర్యాదు పరిష్కార వ్యవస్థలను వినియోగించుకోవాలని సూచించారు.

 

*ఆక్రమణలపై చట్టప్రకారం చర్యలు*

 

భూదాన్, వక్ఫ్ భూముల ఆక్రమణలపై జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మహ్మద్ అయూబ్ స్పందించారు. ఆక్రమణలకు పాల్పడిన వారిపై రాజకీయ సంబంధాలతో సంబంధం లేకుండా చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భూ సమస్యల విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రచారానికి దూరంగా ఉండాలని సూచించారు.జర్నలిస్టుల డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల సమస్యను జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, అర్హులైన జర్నలిస్టులకు న్యాయం జరిగేలా ప్రభుత్వంతో సమన్వయం చేస్తామని అయూబ్ తెలిపారు.

హన్మకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఇనుగాల వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ 22-ఏ భూముల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. అర్హులైన భూ యజమానులకు న్యాయం జరిగేలా సమస్యలను పరిశీలించాలని కోరారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల్లో అపోహలు సృష్టించడం సరికాదన్నారు.

సమావేశంలో టీపీసీసీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు చిలువేరు శ్రీనివాస్, టీపీసీసీ ఓబీసీ సెల్ చైర్మన్ ఓర్సు తిరుపతి, కాంగ్రెస్ పార్టీ మహిళా జిల్లా అధ్యక్షురాలు కర్ణాటి పార్వతమ్మ, యూత్ జిల్లా అధ్యక్షుడు కొరివి పరమేష్, జిల్లా అధికార ప్రతినిధులు నిమ్మా నిశేఖర్‌రావు, ఎర్ర యాకూబ్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, కమలుద్దీన్, వర్ధన్నపేట పట్టణ అధ్యక్షుడు ఈగ దామోదర్, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు రహమతుల్లా, మహిబూద్ పాషా తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img

More articles

Latest article

App Icon

Install VK News App

Add to home screen for faster loading and latest updates.