సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి , ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా కార్యక్రమం
ఈ కార్యక్రమాన్ని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ , గార్లు ప్రారంభోత్సవం చేశారు.
ఈ సందర్భంగా తెలంగాణ శాసన మండలి చైర్మన్
గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ ”
ఉద్యోగం అంటే కేవలం ప్రభుత్వ ఉద్యోగం మాత్రమే కాదు.
ప్రైవేట్ రంగంలో కూడా లక్షల ఉద్యోగాలు ఉన్నవి. భారతదేశంలోనే ఇది మెగా జాబ్ మేళా .
ఈ జాబ్ మెలలో ఉద్యోగం రాకపోతే నిరుత్సాహ పడొద్దు . ఓటమి గెలుపుకు తొలి మెట్టు గా భావించాలి.
ఈ జాబ్ మెలను నిర్వహించిన ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి , ఉత్తమ్ కుమార్ రెడ్డి గార్లను అభినందిస్తున్నాము
ఉత్తమ్ కుమార్ రెడ్డి పని తీరు చాలా మెరుగ్గా ఉంది. ఈ ప్రాంతం అభివృద్ధి కోసం ఉత్తమ్ దంపతులు ఉత్తమంగా పని చేస్తున్నారు.
ఎల్నినో ప్రభావం కారణంగా కొంత కష్ట పరిస్థితిలు ప్రస్తుతం ఉన్నవి.
ఈ ప్రొగ్రాంలో ఎమ్మెల్యేలు బిఎల్ ఆర్ , కుంభం అనిల్ కుమార్ , ఎమ్మెల్సీ శంకర్ నాయక్ , కార్పొరేషన్ చైర్మన్లు పటేల్ రమేష్ రెడ్డి , శ్రీకాంత్ , తదితరులు పాల్గొన్నారు.


