- *సూర్యాపేట పట్టణ బంద్ కు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు
సూర్యాపేట పట్టణంలో శుక్రవారం జరిగిన బంద్ కు పూర్తిగా సహకరించిన వర్తక వ్యాపార వర్గాలకు , హోటల్స్ యజమానులకు మెకానిక్ లకు, లాయర్స్ కు బందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి బుల్లెట్ ట్రైన్ సాధన సమితి జేఏసీ ధన్యవాదాలు తెలిపింది. శనివారం సుధా బ్యాంకు ఆడిటోరియంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఎండలను కూడా లెక్క చేయకుండా పెద్ద ఎత్తున అన్ని వర్గాల ప్రజలు బందులో పాల్గొన్నారని తెలిపారు. సూర్యాపేట ప్రజల ఐకమత్యాన్ని ఈ బంద్ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేశామని, బంద్ కు మద్దతుగా నిలిచిన పాఠశాల కళాశాలల యజమానులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఉపాధ్యాయ సంఘాలు, బీసీ సంఘాలు, ప్రజా సంఘాలకు ధన్యవాదాలు తెలియజేశారు. బంద్ లో బ్యాంకులు, కార్పొరేట్ సంస్థలు షాపింగ్ మాల్స్ కూడా స్వచ్ఛందంగా బంద్ లో పాల్గొన్నారని చెప్పారు. సూర్యాపేట బంద్ బుల్లెట్ ట్రైన్ సాధనలో ఒక కీలకమైన సంఘటన అని ఈ సందర్భంగా పలువురు నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు పెద్దిరెడ్డి రాజా, నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మల్లు, నాగార్జున రెడ్డి , నెమ్మది వెంకటేశ్వర్లు, బూర వెంకటేశ్వర్లు, మందాడి డేవిడ్, కొత్తపల్లి శివకుమార్, చల్లమల్ల నరసింహ, సలిగంటి వీరేంద్ర, ఎల్గూరి రామ్మూర్తి , కర్నాటి కిషన్, పెద్దిరెడ్డి గణేష్, బుల్లెట్ ట్రైన్ సాధన సమితి కన్వీనర్ ఆరుట్ల జానకిరామిరెడ్డి, భూపతి రాములు తదితరులు పాల్గొన్నారు.


