27.2 C
Hyderabad
Thursday, October 1, 2026
Homeతెలంగాణనిమ్స్‌లో సాధ్యం కానిది.. సూర్యాపేట మన అమ్మ హాస్పిటల్లో సుసాధ్యమైంది*
Advertisement spot_img

నిమ్స్‌లో సాధ్యం కానిది.. సూర్యాపేట మన అమ్మ హాస్పిటల్లో సుసాధ్యమైంది*

Must read

*నిమ్స్‌లో సాధ్యం కానిది.. సూర్యాపేట మన అమ్మ హాస్పిటల్లో సుసాధ్యమైంది

 

*45 రోజులుగా మంచానికే పరిమితమైన యువకుడికి మన అమ్మ హాస్పిటల్‌లో డా. సుధీర్‌ అరుదైన శస్త్ర చికిత్స*

 

*డాక్టర్ మరో జన్మను ప్రసాదించాడంటూ కుటుంబ సభ్యుల ఆనందం*

 

*డాక్టర్ సుధీర్ గారు నిజంగా దేవుడే – మాజీ జెడ్పీటీసీ పిన్నేని కోటేశ్వరరావు*

 

సూర్యాపేట:

 

హైదరాబాద్ ప్రఖ్యాత నిమ్స్‌ ఆసుపత్రిలో ఆపరేషన్‌ చేయడం కష్టమని చెప్పి ఇంటికి పంపించిన ఒక యువకుడికి సూర్యాపేటలోని మన అమ్మ హాస్పిటల్‌లో డాక్టర్ దాచేపల్లి సుధీర్ గారు అదే శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. హైదరాబాదులోనే కాదన్న అరుదైన శస్త్ర చికిత్సను సూర్యాపేటలో డాక్టర్ సుధీర్ గారు చేయడంతో డాక్టర్ గారు నిజంగా దేవుడంటూ కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.

 

వివరాల్లోకి వెళ్తే సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్‌ మండలానికి చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు, మాజీ జెడ్పిటిసి పిన్నేని కోటేశ్వరరావు గారి కుమారుడు సంపత్‌ సుమారు 45 రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదంలో వెన్నుముక, తొడ ఎముక కలిసే ప్రాంతంలో మల్టిఫుల్ ఫ్రాక్చర్స్ కావడంతో పరిస్థితి క్లిష్టంగా మారింది.

ప్రమాదం జరిగిన రోజే సూర్యాపేటలోని ఓ వైద్యుడి సూచన మేరకు సంపత్‌ను హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ సుమారు రెండు వారాల పాటు చికిత్స పొందిన అనంతరం, ప్రస్తుతం వాపు ఎక్కువగా ఉందని, వాపు తగ్గిన తర్వాతే ఆపరేషన్‌ చేయవచ్చని వైద్యులు సూచించి డిశ్చార్జి చేశారు.

 

కొద్దిరోజుల తర్వాత వాపు తగ్గడంతో కుటుంబ సభ్యులు మరోసారి నిమ్స్‌కు తీసుకెళ్లారు. అయితే అక్కడి వైద్యులు ఈ ఆపరేషన్‌ చాలా కష్టం, నిదానంగా అదే సెట్‌ అవుతుంది అని చెప్పడంతో మరోసారి ఇంటికి తీసుకురావాల్సి వచ్చింది. అయితే సంపత్‌ పరిస్థితి రోజురోజుకూ ఇబ్బందికరంగా మారింది. తీవ్రమైన నొప్పితో లేవలేక, కూర్చోలేక, నడవలేక దాదాపు 45 రోజుల పాటు మంచానికే పరిమితమయ్యాడు. తన కుమారుడి పరిస్థితిని చూసి తండ్రి కోటేశ్వరరావు, కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు.

మిర్యాలగూడతో పాటు ఇతర ప్రాంతాల్లోని పలువురు వైద్యులను సంప్రదించినప్పటికీ, అందరూ ఈ ఆపరేషన్‌ క్లిష్టమైనదేనని చెప్పడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన మరింత పెరిగింది.

 

*చివరి ప్రయత్నంగా మన అమ్మ వైద్యశాలకు*

 

చివరి ప్రయత్నంగా సంపత్‌కు సంబంధించిన వైద్య రిపోర్టులను సూర్యాపేటలోని మన అమ్మ హాస్పిటల్‌ అధినేత డాక్టర్‌ దాచేపల్లి సుధీర్‌ గారికి కోటేశ్వరరావు చూపించారు. రిపోర్టులను పరిశీలించిన అనంతరం పేషెంట్‌ను స్వయంగా తీసుకురావాలని సూచించిన డాక్టర్‌ సుధీర్‌, అవసరమైన పరీక్షలు నిర్వహించారు.

అనంతరం “ఆపరేషన్‌ చేస్తాను” అని ధైర్యం చెప్పి, అయిదు రోజుల క్రితం క్లిష్టమైన శస్త్రచికిత్సను నిర్వహించారు. తుంటి జాయింట్‌లోని ఎసిటాబులం (Acetabulum) భాగం విరిగి, తొడ ఎముక తన సాధారణ స్థానం నుంచి పక్కకు తొలగిపోవడంతో అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్సను నిర్వహించి సాధారణ స్థితికి తీసుకువచ్చారు.

 

ఆపరేషన్‌ విజయవంతం కావడంతో కుటుంబ సభ్యుల్లో ఆనందం వెల్లివిరిసింది.

ఆపరేషన్‌ జరిగిన కేవలం రెండు రోజులకే సంపత్‌ను కూర్చోబెట్టడం, ప్రస్తుతం కోలుకునే దిశగా అడుగులు వేస్తుండటం కుటుంబ సభ్యులకు ఎంతో ఊరటనిచ్చింది.

 

*డాక్టర్‌ సుధీర్‌ గారు నిజంగా దేవుడే*

 

ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ పిన్నిని కోటేశ్వరరావు మాట్లాడుతూ… తన కుమారుడి పరిస్థితి చూసి తీవ్ర ఆందోళనకు గురయ్యామని, ఎన్నో ఆసుపత్రులు తిరిగిన తర్వాత చివరకు సూర్యాపేటలోని మన అమ్మ హాస్పిటల్‌కు రావడం జరిగిందన్నారు.

అత్యంత క్లిష్టమైన ఆపరేషన్‌ను ఛాలెంజ్‌గా తీసుకుని విజయవంతంగా నిర్వహించిన డాక్టర్‌ దాచేపల్లి సుధీర్‌ నిజంగా దేవుడే అని, అమ్మ పేరుతో హాస్పిటల్ పెట్టిన సుదీర్ గారు నిజంగా అమ్మ ప్రేమను చూపించి మా అబ్బాయికి మరో జీవితాన్ని ఇచ్చాడని కొనియాడారు.

“నిమ్స్‌ వంటి ప్రఖ్యాత ఆసుపత్రిలోనే ఆపరేషన్‌ సాధ్యం కాలేదు. కానీ సూర్యాపేట మన అమ్మ హాస్పిటల్‌లో డాక్టర్‌ సుధీర్‌ గారు ఆపరేషన్‌ను ఛాలెంజ్‌గా తీసుకుని విజయవంతంగా చేశారు. నా కుమారుడిని మళ్లీ కూర్చోబెట్టారు. మా కుటుంబానికి ఆయన నిజంగా దేవుడిలాంటి వారు” అని కోటేశ్వరరావు భావోద్వేగంతో పేర్కొన్నారు.

స్థానికంగా కూడా క్లిష్టమైన ఆర్థోపెడిక్‌ శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహిస్తూ రోగులకు భరోసా కల్పిస్తున్న డాక్టర్‌ సుధీర్‌ను కుటుంబ సభ్యులు అభినందించారు.

- Advertisement -spot_img

More articles

Latest article

App Icon

Install VK News App

Add to home screen for faster loading and latest updates.