29.2 C
Hyderabad
Thursday, October 1, 2026
Homeతెలంగాణహైదరాబాద్ రెస్టారెంట్లలో అపరిశుభ్రత.. 8 ఫుడ్ లైసెన్సులు సస్పెండ్
Advertisement spot_img

హైదరాబాద్ రెస్టారెంట్లలో అపరిశుభ్రత.. 8 ఫుడ్ లైసెన్సులు సస్పెండ్

Must read

హైదరాబాద్, సెప్టెంబర్ 26 (విజయ కెరటం): హైదరాబాద్‌లోని రెస్టారెంట్లలో ఆహార భద్రతా అధికారులు నిర్వహించిన తనిఖీల్లో తీవ్ర అపరిశుభ్రత వెలుగులోకి వచ్చింది. సెప్టెంబర్ 24న TG SAFEకు చెందిన 8 బృందాలు 15 రెస్టారెంట్లలో తనిఖీలు చేపట్టాయి. బొద్దింకలు, ఈగలు, ఎలుకలు, ఎలుకల విసర్జితాలతో పాటు అపరిశుభ్రమైన వంటగదులు, పాత్రలు, డ్రైనేజీ వ్యవస్థలను గుర్తించారు.

గడువు ముగిసిన ఆహార పదార్థాలు, కుళ్లిన కూరగాయలు, సరైన స్టోరేజ్–లేబులింగ్ లేకపోవడం వంటి లోపాలను అధికారులు గుర్తించారు. కల్తీ అనుమానంతో 16 ఆహార నమూనాలను సేకరించారు.

నిబంధనలు ఉల్లంఘించిన 8 సంస్థల FSSAI ఫుడ్ లైసెన్సులను సస్పెండ్ చేసి, వెంటనే వ్యాపార కార్యకలాపాలను నిలిపివేయాలని ఆదేశించారు. మరో 5 సంస్థలకు ఇంప్రూవ్‌మెంట్ నోటీసులు జారీ చేయనున్నారు.

బాచుపల్లిలోని లక్కీ రెస్టారెంట్‌లో భారీగా బొద్దింకలు, తీవ్ర అపరిశుభ్ర పరిస్థితులు గుర్తించడంతో పాటు FSSAI లైసెన్స్ లేకుండానే నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో రెస్టారెంట్‌ను మూసివేశారు. గడువు ముగిసిన ఆహార పదార్థాలను అధికారులు అక్కడికక్కడే పారవేశారు.

- Advertisement -spot_img

More articles

Latest article

App Icon

Install VK News App

Add to home screen for faster loading and latest updates.