Sunday, October 25, 2026
Google search engine
Homeతెలంగాణప్రాణాలకు తెగించి చిన్నారిని కాపాడిన ముగ్గురు.. అభినందించిన సీపీ సజ్జనార్! హుస్సేన్‌సాగర్‌లో ఆరేళ్ల చిన్నారిని రక్షించిన...

ప్రాణాలకు తెగించి చిన్నారిని కాపాడిన ముగ్గురు.. అభినందించిన సీపీ సజ్జనార్! హుస్సేన్‌సాగర్‌లో ఆరేళ్ల చిన్నారిని రక్షించిన ఆటో డ్రైవర్ ఫక్రుద్దీన్, బాలకృష్ణ, మహ్మద్ అఫ్సర్‌కు సన్మానం

📰 Generate e-Paper Clip

ప్రాణాలకు తెగించి చిన్నారిని కాపాడిన ముగ్గురు.. అభినందించిన సీపీ సజ్జనార్!

 

హుస్సేన్‌సాగర్‌లో ఆరేళ్ల చిన్నారిని రక్షించిన ఆటో డ్రైవర్ ఫక్రుద్దీన్, బాలకృష్ణ, మహ్మద్ అఫ్సర్‌కు సన్మానం

హైదరాబాద్‌ (విజయ కెరటం): హుస్సేన్‌సాగర్‌లోకి నెట్టివేయబడిన ఆరేళ్ల చిన్నారిని ప్రాణాలకు తెగించి కాపాడిన ముగ్గురు వ్యక్తులను హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ ఐపీఎస్‌ మనస్ఫూర్తిగా అభినందించి సత్కరించారు. చిన్నారి ప్రాణాలను కాపాడేందుకు సాహసోపేతంగా స్పందించిన ఆటో డ్రైవర్‌ ఫక్రుద్దీన్‌, ప్రైవేట్‌ ఉద్యోగి బాలకృష్ణ, వ్యాపారి మహ్మద్‌ అఫ్సర్‌లను ఆయన ప్రశంసించారు.

 

ఆపదలో ఉన్నవారిని చూసి కొందరు మొబైల్‌ ఫోన్లలో వీడియోలు తీస్తూ ఉండిపోయే పరిస్థితుల్లో, ఈ ముగ్గురు ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్పందించి చిన్నారి ప్రాణాలను కాపాడటం నిజమైన మానవత్వానికి నిదర్శనమని సీపీ పేర్కొన్నారు. క్షణాల్లో స్పందించి చిన్నారికి ప్రాణభిక్ష పెట్టిన వారి ధైర్యసాహసాలు సమాజానికి ఆదర్శమని కొనియాడారు.

 

పిల్లల అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు వంటి సమస్యలు తల్లిదండ్రులకు తీవ్ర మానసిక ఒత్తిడిని కలిగించినప్పటికీ, కన్నబిడ్డల ప్రాణాలు తీయడం ఎప్పటికీ పరిష్కారం కాదని సజ్జనార్‌ సూచించారు. ఎంతటి కష్టాలు ఎదురైనా అధైర్యంతో కఠిన నిర్ణయాలు తీసుకోవద్దని, నైరాశ్యంలో కుంగిపోకుండా సమాజం సహాయం కోరాలని పిలుపునిచ్చారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడానికి సమాజం ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు.

 

ప్రాణం కంటే విలువైనది ఏదీ లేదని, కష్టకాలంలో ధైర్యంగా నిలబడి సహాయం కోరాలని సీపీ సజ్జనార్‌ సందేశమిచ్చారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

App Icon

Install VK News App

Add to home screen for faster loading and latest updates.