నల్గొండ, అక్టోబర్ 8 (విజయ కెరటం):
జాతీయ ఆయుష్ మిషన్ (NAM) కింద నల్గొండ జిల్లాలో వివిధ పోస్టులను ఔట్‌సోర్సింగ్ విధానంలో భర్తీ చేయనున్నట్లు ఆయుష్ శాఖ అధికారులు ప్రకటించారు. మొత్తం 8 పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించారు.
భర్తీ చేయనున్న పోస్టుల్లో చీఫ్ ఆయుష్ వైద్యుడు–1 పోస్టు నెలకు రూ.60,000, ఆయుష్ వైద్య అధికారి–2 పోస్టులు నెలకు రూ.40,000, ఫార్మసిస్ట్ (డ్రగ్ టెక్నీషియన్)–1 పోస్టు నెలకు రూ.20,000, మసాజిక్/మసాజిస్ట్–1 పోస్టుకు రోజుకు రూ.500, యోగా నిపుణుడు–1 పోస్టుకు నెలకు రూ.28,000, బహుళ ప్రయోజన కార్యకర్త (MPW)–2 పోస్టులకు నెలకు రూ.15,000 చొప్పున పారితోషికం అందించనున్నారు.
అభ్యర్థుల వయస్సు 01-07-2026 నాటికి కనీసం 18, గరిష్టంగా 44 సంవత్సరాలు ఉండాలి. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు వర్తిస్తాయి.
దరఖాస్తుల స్వీకరణ: అక్టోబర్ 12 నుంచి అక్టోబర్ 22, 2026 వరకు ప్రతిరోజూ ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. అభ్యర్థులు తమ దరఖాస్తులను నల్గొండ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (GGH)లోని ఆయుష్ విభాగం కార్యాలయంలో సమర్పించాలి.
అర్హతలు, ఖాళీలు, దరఖాస్తు విధానం తదితర పూర్తి వివరాలను సంబంధిత అధికారులు నోటిఫికేషన్‌లో వెల్లడించారు. అవసరమైన ధ్రువపత్రాలతో నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.




