నల్గొండ, అక్టోబర్ 10 (విజయ కెరటం): నల్గొండ పట్టణంలోని ఓల్డ్ సిటీ చౌరస్తా వద్ద ఉన్న హజ్రత్ సయ్యద్ షా మినుల్లాహా షా ఖాద్రీ (రహ్మతుల్లాహి అలైహి) దర్గాలో ఈ నెల 15వ తేదీన సందల్ ఏ షరీఫ్ వేడుక నిర్వహించనున్నారు. గురువారం సాయంత్రం అసర్ నమాజ్ అనంతరం సాయంత్రం 5 గంటలకు వేడుకలు ప్రారంభం కానున్నాయి.
ఈ సందర్భంగా దర్గా కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేయాలని నిర్వాహకుడు అబ్దుల్ కరీం ఖాన్ (అబ్బు) కోరారు. దర్గాలో జరిగే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో భక్తులు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు.




