నల్లగొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా వాల్మీకి జయంతి వేడుకల
వాల్మీకి ఆశయాలు నేటి తరాలకు ఆదర్శం – ఎస్పీ శరత్ చంద్ర పవార్
నల్లగొండ, అక్టోబర్ 26 (విజయ కెరటం): నల్లగొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో మహర్షి వాల్మీకి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతి, సాహిత్య చరిత్రలో మహర్షి వాల్మీకి విశిష్ట స్థానం కలిగిన మహనీయుడని కొనియాడారు. రామాయణ మహాకావ్యాన్ని రచించి ప్రపంచానికి ధర్మం, సత్యం, న్యాయం, మానవతా విలువలను చాటిచెప్పిన ఆదికవి వాల్మీకి అని పేర్కొన్నారు. ఆయన రచనలు తరతరాలకు స్ఫూర్తినిస్తూ సమాజానికి నైతిక విలువలను బోధిస్తున్నాయని అన్నారు.
మహర్షి వాల్మీకి జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని, మనిషి తనలో మంచి మార్పును స్వీకరించి ఉన్నత లక్ష్యాలను సాధించవచ్చనే సందేశాన్ని ఆయన జీవితం అందిస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ సత్యం, ధర్మం, క్రమశిక్షణ, నైతిక విలువలను పాటిస్తూ సమాజ శ్రేయస్సుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. మహర్షి వాల్మీకి ఆశయాలు, బోధనలను నేటి తరాలు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, ఏఓ శివప్రసాద్, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, ఎస్బీ సీఐ నాగరాజు, ఆర్‌ఐలు సంతోష్, శ్రీను, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.




