యువత సమాజ సేవలో చురుగ్గా పాల్గొనాలి: మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డ
నల్గొండ పట్టణంలోని యాటకన్నా రెడ్డి కాలనీలో యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద శ్రీ శ్రీ గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన వినాయక పూజా కార్యక్రమంలో నల్గొండ మాజీ శాసనసభ్యులు శ్రీ కంచర్ల భూపాల్ రెడ్డి గారు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా కంచర్ల భూపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ యువత సమాజ సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. యువత దేశానికి వెన్నుముక లాంటి వారని, సమాజ అభివృద్ధిలో యువత పాత్ర ఎంతో కీలకమని అన్నారు.
గణేష్ నవరాత్రి ఉత్సవాలను తొమ్మిది రోజులపాటు శాంతియుత వాతావరణంలో, భక్తిశ్రద్ధలతో అత్యంత వైభవంగా నిర్వహించుకోవాలని ఆయన కోరారు. వినాయకుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో బి ఆర్ఎస్ పార్టీ పట్టణ బోనగిరి దేవేందర్ మాజీ కౌన్సిలర్ రావుల శ్రీనివాస్ రెడ్డి మొరిశెట్టి నాగేశ్వరరావు రాపోలు వెంకటేశ్వర్లు సిరిగిరి వెంకట్ రెడ్డి యాట నిఖిల్ రెడ్డి ఎర్రబోతు వినీత్ రెడ్డి నాగోతు అభిరామ్ సురేష్ రెడ్డి అశోక్ రెడ్డి మెక్ బాను యాట సునీత మానస యాటభారతమ్మ శోభారాణి పద్మ రాములమ్మ పూలమ్మ యాట వరుణ్ రెడ్డి యాటకన్నా రెడ్డి కాలనీ యువకులు, భక్తులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.


