యువతకు ఉచితంగా Graphic Design with AI Tool కోర్సులో శిక్షణ అందించి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులు తెలిపారు. 2026-27 సంవత్సరానికి అర్హులైన క్రిస్టియన్ మైనారిటీ యువతీ, యువకుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.
అభ్యర్థులు క్రిస్టియన్ మైనారిటీ BC-C సర్టిఫికెట్ లేదా బాప్టిజం సర్టిఫికెట్, ఆధార్ కార్డు కలిగి ఉండాలి. వయస్సు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. పట్టణ ప్రాంతాల వారికి వార్షిక ఆదాయం రూ.2 లక్షలు, గ్రామీణ ప్రాంతాల వారికి రూ.1.50 లక్షలలోపు ఉండాలి. ఆదాయ ధ్రువీకరణ పత్రం మీ సేవా ద్వారా జారీ చేసినదై ఉండాలి. కోర్సుకు అవసరమైన విద్యార్హతగా ఇంటర్ పూర్తి చేసి ఉండాలి. గతంలో ప్రభుత్వం ద్వారా ఏదైనా వృత్తి విద్యలో శిక్షణ పొందిన వారు అనర్హులు.
అర్హత కలిగిన ఆసక్తి గల అభ్యర్థులు అవసరమైన ధ్రువపత్రాలతో సెప్టెంబర్ 25, 2026లోపు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి కార్యాలయం లేదా Softech Educational Society, శివాజీనగర్ డౌన్, SBI బ్యాంక్ పైన కార్యాలయ వేళల్లో దరఖాస్తులు సమర్పించాలి.
మరిన్ని వివరాలకు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ కార్యాలయం, కలెక్టర్ కార్యాలయం నల్గొండను లేదా 9440727085 నంబర్‌ను సంప్రదించాలని జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి టి. విజయేందర్ రెడ్డి తెలిపారు.


