నూకల మల్లమ్మ మృతి.. కుటుంబ సభ్యులను పరామర్శించిన యూత్ కాంగ్రెస్ నాయకుడు బద్దం సుధీర్
తిప్పర్తి, అక్టోబర్ 12 (విజయ కెరటం):
తిప్పర్తి గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ నూకల దేవకమ్మ సైదులు మాతృమూర్తి నూకల మల్లమ్మ అనారోగ్యంతో శనివారం సాయంత్రం మృతి చెందారు. విషయం తెలుసుకున్న యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బద్దం సుధీర్ వారి స్వగృహానికి వెళ్లి మల్లమ్మ భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు గుండా సత్యనారాయణ, జాకటి మోష, రొట్టెల రమేష్, మాజీ ఎంపీటీసీ పల్లె ఎల్లయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు తండు సతీష్ గౌడ్, వార్డు సభ్యులు తుమ్మల నాగరాజు, వంగూరి కిరణ్, చింతకుంట్ల మధు, ఏషబోయిన పరశురాం, నూకలవారిగూడెం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




