భువనగిరి: పట్టణంలోని ఓ ఏటీఎంలో చోరీకి దుండగుడు చేసిన ప్రయత్నం పోలీసుల అప్రమత్తతతో విఫలమైంది.
దుండగుడు ఏటీఎం యంత్రాన్ని ధ్వంసం చేసి అందులోని నగదును అపహరించేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. అయితే, ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకోవడంతో నిందితుడు నగదు దోచుకోకుండానే అక్కడి నుంచి పరారయ్యాడు
ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న దుండగుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోంది.


