చలో ఢిల్లీ కార్యక్రమానికి నల్లగొండ కాంగ్రెస్ శ్రేణుల తరలింప
రెండు బస్సుల్లో ఎయిర్‌పోర్టుకు చేరుకున్న నాయకులు.. రాత్రి విమానంలో ఢిల్లీకి ప్రయాణం
నల్లగొండ, అక్టోబర్ 31 (విజయ కెరటం): ఓటర్ల హక్కుల పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నాయకత్వంలో నవంబర్ 1న దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించనున్న చలో ఢిల్లీ నిరసన కార్యక్రమానికి నల్లగొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తరలివెళ్లాయి.
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశాల మేరకు నల్లగొండలోని క్యాంపు కార్యాలయం నుంచి రెండు బస్సుల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి శనివారం రాత్రి విమానంలో ఢిల్లీకి బయలుదేరనున్నారు.
ఈ కార్యక్రమంలో నల్లగొండ మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ మేయర్ మహమ్మద్ అష్రఫ్ అలీ అమేర్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, కార్పొరేటర్లు, ఎండీ ఖలీల్, సయ్యద్ సమద్, మాజీ కౌన్సిలర్లు, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

