నల్లగొండ :
విజయ కెరటం న్యూస్
ప్రభుత్వ ఆసుపత్రిలో శిశువు మృతి.. కుటుంబ సభ్యుల ఆందోళన
నల్లగొండ ఇందిరమ్మ కాలనీకి చెందిన కంభంపాటి కవిత (25) ప్రసవం కోసం ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ కేంద్రంలో చేరారు.
నిన్న బిడ్డ ఆరోగ్యంగా ఉందని, నార్మల్ డెలివరీ అవుతుందని వైద్యులు తెలిపారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. అయితే తెల్లవారుజామున బిడ్డ హార్ట్‌బీట్ సరిగ్గా లేదంటూ అత్యవసరంగా ఆపరేషన్ చేయాలని సూచించినట్లు తెలిపారు.
ఆపరేషన్ అనంతరం కొద్దిసేపటికే శిశువు మృతి చెందినట్లు సమాచారం ఇచ్చారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.
“నిన్నటి వరకు బిడ్డ బాగుందన్నారు.. ఒక్కసారిగా ఏమైంది?” అంటూ ఆసుపత్రి ఎదుట కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.
వైద్యులు, ఆసుపత్రి సూపరింటెండెంట్ అందుబాటులో లేకపోవడంపై కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఆసుపత్రి వద్ద భారీగా మోహరించారు.
శిశువు మృతికి అసలు కారణమేంటో అధికారులు విచారణ చేసి నిజాలను వెలుగులోకి తీసుకురావాలని కుటుంబ సభ్యులు, స్థానికులు కోరుతున్నారు.


