నల్గొండ: నల్గొండ జిల్లా కేంద్రంలో ఆగస్టు 29న ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించనున్నారు. AIMIM 29వ డివిజన్ కార్పొరేటర్ మొహమ్మద్ ఖాజా సమీఉద్దీన్ (నదీమ్) ,ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని Gleneagles Hospitals – Fortis Network Hospitals వైద్యుల సహకారంతో ఈ శిబిరం ఏర్పాటు చేస్తున్నారు.
ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగే ఈ శిబిరంలో గుండె, కిడ్నీ సంబంధిత సమస్యలు, జనరల్ ఫిజిషియన్ సేవలు, 2D ఎకో, ECG, బీపీ తదితర వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
అదేవిధంగా కంటి వైద్య పరీక్షలు కూడా నిర్వహించి, అవసరమైన వారికి ఉచిత కంటి పరీక్షలు, తదుపరి చికిత్సకు సంబంధించిన సూచనలు అందించనున్నారు.
ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. సంప్రదింపుల కోసం 7013107247 నంబర్‌ను ప్రకటించారు.


