నల్లగొండ: మిలాద్ ఉల్ నబీ సందర్భంగా నల్లగొండ పట్టణంలోని క్లాక్ టవర్ వద్ద మిలాద్ కమిటీ ఆధ్వ ర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని నల్లగొండ డీఎస్పీ శివ రాంరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ, ప్రవక్త ,కరుణ, మానవత్వం, సత్యసంధతను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా నల్గొండ డిప్యూటీ మేయర్ అమీర్, 29వ డివిజన్ కార్పొరేటర్ మొహమ్మద్ నదీమ్ పాల్గొని రక్తదాతలకు సర్టిఫికెట్లు అందజేశారు. అలాగే 22వ డివిజన్ కార్పొరేటర్ సయ్యద్ సమద్ కూడా కార్యక్రమంలో పాల్గొని సర్టిఫికెట్ల పంపిణీలో భాగస్వాములయ్యారు.
మిలాద్ ఉన్ నబీ సందర్భంగా నిర్వహించిన ఈ రక్తదాన కార్యక్రమంలో పలువురు స్వచ్ఛందంగా రక్తదానం చేసి సామాజిక సేవలో భాగస్వాములయ్యారు.
మిలాద్ ఉన్ నబీ సందర్భంగా నిర్వహించిన ఈ రక్తదాన కార్యక్రమం ద్వారా రక్తదానం ప్రాముఖ్యతను ప్రజలకు చాటిచెప్పడంతో పాటు, ఆపదలో ఉన్న వారికి రక్తం అందించేందుకు దాతలు ముందుకు రావడం అభినందనీయమని నిర్వాహకులు పేర్కొన్నారు.


