ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న టూ టౌన్ పోలీసులు
నల్లగొండ: గంజాయి అక్రమ రవాణా, విక్రయాలతో పాటు బైక్ చోరీలకు పాల్పడుతున్న ముఠాను నల్లగొండ టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ శివరాం రెడ్డి వెల్లడించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. నిందితులు ఒడిశా నుంచి గంజాయిని అక్రమంగా నల్లగొండకు తరలించి, చిన్న చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి ఒక్కో ప్యాకెట్‌ను రూ.500 చొప్పున విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో గుర్తించారు.
నిందితుల నుంచి మొత్తం 2.5 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.25 వేలుగా ఉంటుందని పోలీసులు అంచనా వేశారు.
అదేవిధంగా నిందితుల వద్ద నుంచి 4 బైక్‌లు, 5 సెల్‌ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు డీఎస్పీ శివరాం రెడ్డి వెల్లడించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
కేసుకు సంబంధించి మరింత సమాచారం సేకరించేందుకు తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని డీఎస్పీ తెలిపారు.


