25.7 C
Hyderabad
Wednesday, September 16, 2026
Homeతెలంగాణవనం భాస్కర్‌కు అండగా నిలిచిన మొహమ్మద్ అయూబ్
Advertisement spot_img

వనం భాస్కర్‌కు అండగా నిలిచిన మొహమ్మద్ అయూబ్

Must read

వరంగల్: వరంగల్ తూర్పు ప్రాంతానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ వనం భాస్కర్ ఆరోగ్యం క్షీణించడంతో హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు ఎల్‌ఓసీ ద్వారా ఉచిత వైద్యం అందేలా వరంగల్ జిల్లా అధ్యక్షుడు మొహమ్మద్ అయూబ్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు.

ఈ సందర్భంగా మొహమ్మద్ అయూబ్  తన ఎదుగుదలకు సహకరించిన వరంగల్ తూర్పు ప్రాంత జర్నలిస్టులంటే తనకు ఎంతో ప్రత్యేకమైన అభిమానమని, వారికి తాను ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని తెలిపారు.

సీనియర్ జర్నలిస్ట్ వనం భాస్కర్‌కు ఎల్‌ఓసీ నిధుల ద్వారా ఉచిత చికిత్స అందేలా సహకరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మొహమ్మద్ అయూబ్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

వనం భాస్కర్ గారు త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు అయూబ్ ఆకాంక్షించారు.

- Advertisement -spot_img

More articles

Latest article

App Icon

Install VK News App

Add to home screen for faster loading and latest updates.