Sunday, November 1, 2026
Homeక్రైమ్రూ.20 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన లీగల్ మెట్రాలజీ ఇన్‌స్పెక్టర్

రూ.20 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన లీగల్ మెట్రాలజీ ఇన్‌స్పెక్టర్

📰 Generate e-Paper Clip

  • రూ.20 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన లీగల్ మెట్రాలజీ ఇన్‌స్పెక్టర

పెట్రోల్ బంక్ టెక్నీషియన్ ద్వారా లంచం స్వీకరణ.. ఇద్దరిపై కేసు నమోదు

హైదరాబాద్, అక్టోబర్ 28 (విజయ కెరటం):

యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన లీగల్ మెట్రాలజీ ఇన్‌స్పెక్టర్ కె. వెంకటేశ్వర్లు, మరో ప్రైవేట్ వ్యక్తి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. పెట్రోల్ బంక్‌కు సంబంధించిన వెరిఫికేషన్ సర్టిఫికెట్ జారీ చేసి, డైలీ సేల్స్ రిజిస్టర్ అందజేసినందుకు ప్రతిఫలంగా రూ.20 వేల లంచం తీసుకుంటుండగా నల్లగొండ రేంజ్ ఏసీబీ అధికారులు బుధవారం వారిని పట్టుకున్నారు.

ఏసీబీ వివరాల ప్రకారం.. పెట్రోల్ బంక్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న ప్రైవేట్ వ్యక్తి కాసారం రవీందర్ ద్వారా ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లు లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అధికారుల సూచనల మేరకు రవీందర్ ఫిర్యాదుదారుడి నుంచి హైదరాబాద్‌లోని ఎల్‌బీ నగర్ వద్ద రూ.20 వేలు స్వీకరించాడు. ఇందులో రూ.15 వేలు ఇన్‌స్పెక్టర్‌కు, రూ.5 వేలు తనకు ఇవ్వాలనేది ఒప్పందంగా ఏసీబీ వెల్లడించింది.

లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు ఇద్దరినీ అదుపులోకి తీసుకుని, నాంపల్లిలోని ఎస్పీఈ, ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచేందుకు చర్యలు చేపట్టారు. ఈ కేసు ప్రస్తుతం దర్యాప్తులో ఉందని ఏసీబీ తెలిపింది. ఫిర్యాదుదారుడి భద్రత దృష్ట్యా వివరాలను వెల్లడించలేదు.

లంచం అడిగితే 1064కు ఫిర్యాదు చేయండి

ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు. వాట్సాప్ నంబర్ 9440446106 ద్వారా కూడా ఏసీబీని సంప్రదించవచ్చని తెలిపారు. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

App Icon

Install VK News App

Add to home screen for faster loading and latest updates.