సంఘటితంగా ఉంటేనే ఉద్యోగుల సమస్యలకు పరిష్కారం
పంచాయతీరాజ్ మినిస్ట్రీయల్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కొప్పు రాంబాబ
నల్లగొండ, అక్టోబర్ 28 (విజయ కెరటం): పంచాయతీరాజ్ మినిస్ట్రీయల్ ఉద్యోగులు సంఘటితంగా ఉంటేనే తమ సమస్యలను పరిష్కరించుకోవడంతో పాటు న్యాయమైన హక్కులను సాధించుకోగలరని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు కొప్పు రాంబాబు అన్నారు.
బుధవారం నల్లగొండ జిల్లా పరిషత్ కార్యాలయంలో 2026–27 సంవత్సరానికి సంబంధించి పంచాయతీరాజ్ మినిస్ట్రీయల్ ఉద్యోగుల సంఘం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ ఉద్యోగులకు సభ్యత్వ రసీదులను అందజేశారు.
అనంతరం కొప్పు రాంబాబు మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి పంచాయతీరాజ్ మినిస్ట్రీయల్ ఉద్యోగి సంఘంలో సభ్యత్వం తీసుకోవాలని, వార్షిక సభ్యత్వ రుసుము రూ.300 చెల్లించాలని కోరారు. ఉద్యోగుల హక్కుల పరిరక్షణకు, న్యాయమైన డిమాండ్ల సాధనకు సంఘం కీలక వేదికగా నిలుస్తుందని తెలిపారు.
ఉద్యోగుల ఐక్యతే సంఘానికి బలమని, ఐక్య పోరాటమే సమస్యల పరిష్కారానికి మార్గమని పేర్కొన్నారు. ప్రతి ఉద్యోగి సంఘంలో భాగస్వామి కావడం ద్వారా తమ సమస్యలను సమిష్టిగా అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకునే అవకాశం ఉంటుందన్నారు. ఉద్యోగుల సంక్షేమం, హక్కుల సాధనతో పాటు విధి నిర్వహణలో ఎదురయ్యే ఇబ్బందుల పరిష్కారానికి సంఘం నిరంతరం కృషి చేస్తుందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సూపరింటెండెంట్ బసవోజు శ్రీనివాస్ చారి, సీనియర్ అసిస్టెంట్లు హరినాథ్, శ్రీనివాస్, ప్రవీణ్, విజయ్, శోభ, జూనియర్ అసిస్టెంట్లు బుర్రి వెంకటేశ్వర్లు, ఎం.డి. గులాం రబ్బాని, ప్రకాష్, రేణుక, రేఖ, భాగ్యవతి, విజయభాస్కర్, స్నేహ, మౌనిక, కస్తూరిబాల, రజిత, అముతుల్ ఫాతిమా, వెంకట్ రెడ్డి, వినోద్ తదితరులు పాల్గొన్నారు.

