హైదరాబాద్: నిమ్స్‌లో ఈ నెల 13వ తేదీ నుంచి చిన్నారులకు ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు నిర్వహించనున్నారు. ముందుగా వాక్-ఇన్ విధానంలో చిన్నారులను వైద్యులు పరీక్షించి, అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. అనంతరం శస్త్రచికిత్స అవసరమైన చిన్నారులకు ఉచితంగా ఆపరేషన్లు చేయనున్నారు.
ఇప్పటికే ఉన్న వైద్య పరీక్షల రిపోర్టులతో సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య నిమ్స్ పాత బ్లాక్‌లో సంప్రదించవచ్చని నిమ్స్ డైరెక్టర్ రాహుల్ దేవరాజ్ తెలిపారు. గత ఐదేళ్లుగా చిన్నారులకు ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.


