నల్గొండ: నల్గొండ నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సు లో ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు బస్టాండ్ నుంచి బయలుదేరుతుంటే ఓ మహిళ బస్సు తగిలి బస్సు కింద పడిపోయింది.
ఈ ఘటనను గమనించిన స్థానికులు వెంటనే స్పందించి మహిళను బస్సు కింద నుంచి బయటకు తీశారు. ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలు కాగా, చేతికి ఫ్రాక్చర్ అయినట్లు సమాచారం. వెంటనే అంబులెన్స్‌కు సమాచారం అందించడంతో ఆమెను చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ప్రమాదం చోటుచేసుకున్నపుడు బస్సు డ్రైవర్ అక్కడి నుంచి పరిపొయదు . ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.


