నల్లగొండ, ఆగస్టు 22 (విజయకెరటం ప్రతినిధి): దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం (మహిళా ప్రాంగణం), నల్లగొండలో మహిళలకు 30 రోజుల ఉచిత బ్యూటిషన్ శిక్షణ కోర్సు నిర్వహించనున్నట్లు జిల్లా మేనేజర్ ఆర్. మమత తెలిపారు.
ఈ శిక్షణకు 18 నుంచి 30 సంవత్సరాల లోపు మహిళలు, 10వ తరగతి వరకు విద్యార్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. సాధారణ మహిళలతో పాటు పాఠశాల విద్యను మధ్యలో నిలిపివేసిన మహిళలు, ఒంటరి మహిళలు, దివ్యాంగ మహిళలకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు.
శిక్షణ తరగతులు 2026 సెప్టెంబర్ 2 నుంచి ప్రారంభమవుతాయి. ఆసక్తి ఉన్నవారు విద్యార్హత ధ్రువపత్రం జిరాక్స్ కాపీ, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ, రెండు పాస్పోర్ట్ సైజు ఫొటోలతో దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం (మహిళా ప్రాంగణం), నల్లగొండ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.
ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని మమత కోరారు. మరిన్ని వివరాలకు 7660022517, 08682-24416 నంబర్లను సంప్రదించవచ్చని తెలిపారు.


