29 C
Hyderabad
Wednesday, September 16, 2026
Homeఆంధ్రప్రదేశ్బండరాయితో భార్యపై దాడి.. భర్తపై కేసు
Advertisement spot_img

బండరాయితో భార్యపై దాడి.. భర్తపై కేసు

Must read

తిరుపతి: భార్యపై అనుమానంతో భర్త దారుణానికి పాల్పడ్డాడు. బండరాయితో భార్యపై దాడి చేయడంతో ఆమె తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఘటన తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జయనగర్‌లో చోటుచేసుకుంది.

జయనగర్‌లో నివాసం ఉంటున్న షేక్ మస్తాన్‌కు భార్య మల్లికపై కొంతకాలంగా అనుమానం ఉండటంతో తరచూ కుటుంబంలో గొడవలు జరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో అర్థరాత్రి దాటిన తర్వాత మల్లికపై బండరాయితో దాడి చేసినట్లు సమాచారం.

మల్లిక అరుపులు విన్న కుమార్తె యాస్మిన్, స్థానికుల సహాయంతో ఆమెను రక్షించి 108 వాహనంలో రూయా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం స్విమ్స్‌కు తరలించారు.

టైలరింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్న మల్లికకు ముగ్గురు కుమార్తెలు కాగా, ఇద్దరికి వివాహాలు అయ్యాయి. ప్రస్తుతం చిన్న కుమార్తెతో కలిసి భార్యాభర్తలు నివసిస్తున్నారు.

ఈ ఘటనపై బాధితురాలి కుమార్తె యాస్మిన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈస్ట్ పోలీసులు క్రైమ్ నంబర్ 434/2026 నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కేసును ఎస్‌ఐ రామస్వామి విచారిస్తున్నారు.

- Advertisement -spot_img

More articles

Latest article

App Icon

Install VK News App

Add to home screen for faster loading and latest updates.