27.2 C
Hyderabad
Thursday, October 1, 2026
Homeతెలంగాణబావిలో వ్యక్తి పడటంతో కలుషితమైన తాగునీరు.. వెంటనే స్పందించిన కార్పొరేటర్
Advertisement spot_img

బావిలో వ్యక్తి పడటంతో కలుషితమైన తాగునీరు.. వెంటనే స్పందించిన కార్పొరేటర్

Must read

నల్లగొండ, సెప్టెంబర్ 24 (విజయ కెరటం ప్రతినిధి):

నల్లగొండ ఓల్డ్ సిటీలోని 29వ డివిజన్‌ కొండ చల్మా బాయి వద్ద తాగునీటి బావిలో ఓ వ్యక్తి పడటంతో నీరు కలుషితమైన ఘటన చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న స్థానిక కార్పొరేటర్ ఖాజా సమీ ఉద్దీన్ (నదీమ్) వెంటనే స్పందించి, బావిలోని కలుషిత నీటిని మోటర్ల సహాయంతో పూర్తిగా బయటకు తొలగించి శుభ్రం చేయించారు.

ప్రజలకు పరిశుభ్రమైన తాగునీరు అందించేందుకు అవసరమైన చర్యలు చేపట్టినట్లు కార్పొరేటర్ తెలిపారు. బావిని పూర్తిగా శుభ్రం చేసిన అనంతరం రేపటి నుంచి కొండ చల్మా బాయి నీటిని ప్రజలు తీసుకెళ్లవచ్చని ఆయన సూచించారు.

ప్రజల తాగునీటి సమస్యపై సమాచారం అందిన వెంటనే స్పందించి, సిబ్బందితో కలిసి తక్షణ చర్యలు చేపట్టిన కార్పొరేటర్ నదీమ్‌పై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. సమస్యను ఆలస్యం చేయకుండా పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నందుకు ఆయనను అభినందించారు.

- Advertisement -spot_img

More articles

Latest article

App Icon

Install VK News App

Add to home screen for faster loading and latest updates.