29.2 C
Hyderabad
Thursday, October 1, 2026
Homeతెలంగాణఓల్డ్ బస్టాండ్ వద్ద పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయాలి డీజీపీకి మాజీ మంత్రి జీవన్ రెడ్డి...
Advertisement spot_img

ఓల్డ్ బస్టాండ్ వద్ద పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయాలి డీజీపీకి మాజీ మంత్రి జీవన్ రెడ్డి లేఖ

Must read

జగిత్యాల జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 24 (విజయ కెరటం): జగిత్యాల పట్టణంలోని ఓల్డ్ బస్ స్టేషన్ సమీపంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పెట్రోల్, డీజిల్ బంక్‌ను వెంటనే ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. టి. జీవన్ రెడ్డి రాష్ట్ర డీజీపీ సి.వి. ఆనంద్‌ను కోరారు. ఈ మేరకు ఆయన డీజీపీకి లేఖ రాశారు.

జగిత్యాల పట్టణం నాలుగు వైపులా 4 నుంచి 5 కిలోమీటర్ల మేర విస్తరించి ఉందని, ప్రస్తుతం న్యూ బస్ స్టేషన్ పరిధిలోనే పెట్రోల్ బంకులు ఉండటంతో ఓల్డ్ బస్ స్టేషన్, ధర్మపురి రోడ్, మిషన్ కాంపౌండ్ ప్రాంతాల ప్రజలు సుమారు 2 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తోందని తెలిపారు. దీంతో యావర్ రోడ్డుపై ట్రాఫిక్ సమస్య కూడా పెరుగుతోందని పేర్కొన్నారు.

ఓల్డ్ బస్ స్టేషన్ సమీపంలోని పోలీస్ క్వార్టర్స్ స్థలంలో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీ గతంలో ప్రతిపాదించారని, ఇందుకోసం 2023లోనే సీల్డ్ టెండర్లు కూడా పిలిచారని గుర్తు చేశారు. అయినప్పటికీ ఇప్పటివరకు బంక్ ఏర్పాటు కాకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

పోలీస్, జైళ్ల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నిర్వహిస్తున్న పెట్రోల్ బంకులు ప్రజలకు సేవలందిస్తున్నాయని పేర్కొన్న జీవన్ రెడ్డి, అదే తరహాలో జగిత్యాలలోనూ బంక్ ఏర్పాటు చేసి వచ్చే ఆదాయాన్ని పోలీస్ సిబ్బంది కుటుంబాల సంక్షేమానికి వినియోగించాలని సూచించారు.

- Advertisement -spot_img

More articles

Latest article

App Icon

Install VK News App

Add to home screen for faster loading and latest updates.