Tuesday, October 27, 2026
Google search engine
Homeతెలంగాణకోదాడ నియోజకవర్గ రహదారులకు రూ.52.50 కోట్లు మంజూరు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి...

కోదాడ నియోజకవర్గ రహదారులకు రూ.52.50 కోట్లు మంజూరు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి కృషితో నాలుగు ప్రధాన రహదారులకు నిధులు

📰 Generate e-Paper Clip

కోదాడ నియోజకవర్గ రహదారులకు రూ.52.50 కోట్లు మంజూరు

 

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి కృషితో నాలుగు ప్రధాన రహదారులకు నిధులు.

కోదాడ, అక్టోబర్ 13 (విజయ కెరటం):

 

కోదాడ నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.52.50 కోట్ల నిధులు మంజూరు చేసింది. మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే నలమాద పద్మావతి రెడ్డి ప్రత్యేక చొరవతో నాలుగు ప్రధాన రహదారుల విస్తరణ, పటిష్టీకరణ పనులకు పరిపాలనా అనుమతులు లభించాయి.

 

ఈ మేరకు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంగళవారం జీవో ఆర్టీ నంబర్ 533ను జారీ చేసింది. 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ప్లాన్ ఎండీఆర్ నిధుల కింద ఈ పనులను చేపట్టేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఆయా రహదారులను పంచాయతీరాజ్ శాఖ నుంచి రోడ్లు, భవనాల శాఖకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

 

మంజూరైన రహదారులు.. నిధుల వివరాలు:

 

– పాత జాతీయ రహదారి–9 నుంచి కొండాపురం వరకు 12.2 కిలోమీటర్ల రహదారి విస్తరణ, పటిష్టీకరణకు రూ.27 కోట్లు.

– బేతవోలు నుంచి ఆచార్యులగూడెం వరకు 5.6 కిలోమీటర్ల రహదారి అభివృద్ధికి రూ.13.50 కోట్లు.

– పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి కిష్టాపురం రోడ్డు వరకు 2 కిలోమీటర్ల రహదారి విస్తరణకు రూ.4.50 కోట్లు.

– పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి రామలక్ష్మీపురం వరకు 3.1 కిలోమీటర్ల రహదారి అభివృద్ధికి రూ.7.50 కోట్లు.

 

ఈ రహదారుల అభివృద్ధితో ఆయా గ్రామాల మధ్య రవాణా సౌకర్యాలు మెరుగుపడనున్నాయి. రైతులు వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్లకు తరలించడంతో పాటు విద్యార్థులు విద్యాసంస్థలకు, ప్రజలు వైద్య సేవలు పొందేందుకు ప్రయాణించడం మరింత సులభతరం కానుంది.

 

గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి చేసిన కృషితో ఈ నిధులు మంజూరయ్యాయి. మంజూరైన పనులకు సంబంధించి తదుపరి చర్యలు చేపట్టాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ చీఫ్ ఇంజినీర్‌ను ప్రభుత్వం ఆదేశించింది.

 

నిధుల మంజూరుపై హర్షం

 

కోదాడ నియోజకవర్గంలోని నాలుగు ప్రధాన రహదారుల అభివృద్ధికి రూ.52.50 కోట్లు మంజూరు కావడంపై స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

App Icon

Install VK News App

Add to home screen for faster loading and latest updates.