నల్గొండ మెడికల్ కాలేజీలో పారామెడికల్ డిప్లొమా కోర్సులకు ప్రవేశాలు
దరఖాస్తులకు అక్టోబర్ 24 చివరి తేదీ.. రెండు కోర్సుల్లో 60 సీట్లు
నల్గొండ, అక్టోబర్ 17 (విజయ కెరటం): నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి రెండేళ్ల పారామెడికల్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ తెలిపారు. తెలంగాణ పారామెడికల్ బోర్డు (TGPMB) నోటిఫికేషన్ నంబర్ 152 ప్రకారం ఈ ప్రవేశాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
అందుబాటులో ఉన్న కోర్సులు:
– డిప్లొమా ఇన్ అనస్థీషియా టెక్నీషియన్ (DANS) – 30 సీట్లు
– డిప్లొమా ఇన్ డయాలసిస్ టెక్నీషియన్ – 30 సీట్లు
మొత్తం 60 సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. నోటిఫికేషన్ అక్టోబర్ 14న విడుదల కాగా, దరఖాస్తుల సమర్పణకు అక్టోబర్ 24వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు గడువు ఉందన్నారు.
అర్హులైన అభ్యర్థులు www.tgpmb.telangana.gov.in వెబ్సైట్ నుంచి దరఖాస్తు ఫారాన్ని డౌన్లోడ్ చేసుకుని, పూర్తిచేసిన ఫారంతో పాటు అవసరమైన ధ్రువపత్రాలు, ప్రాసెసింగ్ ఫీజును నగదు రూపంలో జతచేసి నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాలలో నేరుగా సమర్పించాలని సూచించారు. అర్హతలు, దరఖాస్తు విధానం, ఇతర నిబంధనలకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారిక వెబ్సైట్లో పరిశీలించాలని ప్రిన్సిపాల్ తెలిపారు.




