Sunday, October 25, 2026
Google search engine
Homeతెలంగాణఓటరు నమోదుకు మరో అవకాశం.. అక్టోబర్ 15, 16 తేదీల్లో ప్రత్యేక శిబిరాలు 18 ఏళ్లు...

ఓటరు నమోదుకు మరో అవకాశం.. అక్టోబర్ 15, 16 తేదీల్లో ప్రత్యేక శిబిరాలు 18 ఏళ్లు నిండిన యువత ఫారం-6తో దరఖాస్తు చేసుకోవాలి

📰 Generate e-Paper Clip

ఓటరు నమోదుకు మరో అవకాశం.. అక్టోబర్ 15, 16 తేదీల్లో ప్రత్యేక శిబిరాలు

 

18 ఏళ్లు నిండిన యువత ఫారం-6తో దరఖాస్తు చేసుకోవాలి

హైదరాబాద్, అక్టోబర్ 14 (విజయ కెరటం): తెలంగాణలో కొత్త ఓటర్ల నమోదు, ఓటర్ల జాబితాలో పేర్ల సవరణ కోసం ఎన్నికల సంఘం ప్రత్యేక శిబిరాలను నిర్వహించనుంది. ఈ నెల 15, 16 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా ఓటరు నమోదు శిబిరాలు ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి వెల్లడించారు.

 

కొత్తగా 18 ఏళ్లు నిండిన యువతతో పాటు, ముసాయిదా ఓటర్ల జాబితాలో పేర్లు లేని అర్హులైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఓటు హక్కు పొందేందుకు ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

 

  1. ప్రత్యేక శిబిరాల్లో అందిన దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారి పేర్లను నవంబర్ 9న విడుదల చేయనున్న తుది ఓటర్ల జాబితాలో చేర్చనున్నట్లు సీఈవో పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

App Icon

Install VK News App

Add to home screen for faster loading and latest updates.