Sunday, October 25, 2026
Google search engine
Homeతెలంగాణచిట్టీల పేరుతో కోట్ల వసూళ్లు.. ప్రభుత్వ టీచర్‌పై బాధితుల ఫిర్యాదు

చిట్టీల పేరుతో కోట్ల వసూళ్లు.. ప్రభుత్వ టీచర్‌పై బాధితుల ఫిర్యాదు

📰 Generate e-Paper Clip

సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలంలో ఘటన.. డబ్బులు తిరిగి ఇవ్వకుండా కుటుంబంతో పరారీ అయినట్లు ఆరోపణలు

సూర్యాపేట: అక్టోబర్ 4 విజయ కెరటం ప్రతినిధి విద్యార్థులకు నీతి, విలువలు బోధించాల్సిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై చిట్టీలు, డైలీ కలెక్షన్ల పేరుతో భారీగా నగదు వసూలు చేసి బాధితులను మోసం చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం ఏనెగంటి తండాకు చెందిన బానోత్ రాజు ప్రస్తుతం ఆత్మకూర్ (ఎస్) మండలం శెట్టిగూడెం ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం.

ప్రభుత్వ ఉద్యోగం, సమాజంలో ఉన్న పరిచయాలు, నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని రాజు తన భార్య అనూష సహకారంతో సూర్యాపేట రూరల్, చివ్వెంల పరిసర ప్రాంతాల్లో చిట్టీలు, డైలీ కలెక్షన్లు నిర్వహించినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ప్రతిరోజూ సుమారు రూ.2 లక్షల వరకు డైలీ కలెక్షన్లు, అప్పుల రూపంలో వసూలు చేసినట్లు చెబుతున్నారు. తొలుత చిట్టీలు సజావుగా సాగడంతో పలువురు ఉద్యోగులు, వ్యాపారులు, స్థానికులు తమ కష్టార్జితాన్ని ఆయన వద్ద పెట్టినట్లు సమాచారం.

గడువు ముగియడంతో అసలు సమస్య..

చిట్టీల గడువు పూర్తయ్యాక తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని బాధితులు ఒత్తిడి చేయడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. డబ్బులు చెల్లించకుండా కాలయాపన చేయడంతో పాటు ఫోన్ స్విచ్చాఫ్ చేసి, కుటుంబంతో సహా వెళ్లిపోయినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. తమ పిల్లల పెళ్లిళ్లు, ఇతర అవసరాల కోసం దాచుకున్న డబ్బులు తిరిగి రాకపోవడంతో పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

దీంతో బాధితులు స్థానిక పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది. చిట్టీలకు సంబంధించిన లెక్కలు, ఆర్థిక లావాదేవీలు, బాధితుల నుంచి వసూలైన నగదు, ఆ నగదు ఎక్కడికి వెళ్లిందనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.

Previous article
సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలంలో ఘటన.. డబ్బులు తిరిగి ఇవ్వకుండా కుటుంబంతో పరారీ అయినట్లు ఆరోపణలు సూర్యాపేట: అక్టోబర్ 4 విజయ కెరటం ప్రతినిధి విద్యార్థులకు నీతి, విలువలు బోధించాల్సిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై చిట్టీలు, డైలీ కలెక్షన్ల పేరుతో భారీగా నగదు వసూలు చేసి బాధితులను మోసం చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం ఏనెగంటి తండాకు చెందిన బానోత్ రాజు ప్రస్తుతం ఆత్మకూర్ (ఎస్) మండలం శెట్టిగూడెం ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వ ఉద్యోగం, సమాజంలో ఉన్న పరిచయాలు, నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని రాజు తన భార్య అనూష సహకారంతో సూర్యాపేట రూరల్, చివ్వెంల పరిసర ప్రాంతాల్లో చిట్టీలు, డైలీ కలెక్షన్లు నిర్వహించినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ప్రతిరోజూ సుమారు రూ.2 లక్షల వరకు డైలీ కలెక్షన్లు, అప్పుల రూపంలో వసూలు చేసినట్లు చెబుతున్నారు. తొలుత చిట్టీలు సజావుగా సాగడంతో పలువురు ఉద్యోగులు, వ్యాపారులు, స్థానికులు తమ కష్టార్జితాన్ని ఆయన వద్ద పెట్టినట్లు సమాచారం. గడువు ముగియడంతో అసలు సమస్య.. చిట్టీల గడువు పూర్తయ్యాక తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని బాధితులు ఒత్తిడి చేయడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. డబ్బులు చెల్లించకుండా కాలయాపన చేయడంతో పాటు ఫోన్ స్విచ్చాఫ్ చేసి, కుటుంబంతో సహా వెళ్లిపోయినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. తమ పిల్లల పెళ్లిళ్లు, ఇతర అవసరాల కోసం దాచుకున్న డబ్బులు తిరిగి రాకపోవడంతో పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో బాధితులు స్థానిక పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది. చిట్టీలకు సంబంధించిన లెక్కలు, ఆర్థిక లావాదేవీలు, బాధితుల నుంచి వసూలైన నగదు, ఆ నగదు ఎక్కడికి వెళ్లిందనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది
Next article
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

App Icon

Install VK News App

Add to home screen for faster loading and latest updates.