- టీజీవోస్ బతుకమ్మ సంబరాలకు మహిళా ఐఏఎస్ అధికారులకు ఆహ్వాన
హైదరాబాద్, అక్టోబర్ 12 (విజయ కెరటం):
బతుకమ్మ సంబరాలు–2026 సందర్భంగా ఈ నెల 14న హైదరాబాద్‌లోని నాంపల్లిలో ఉన్న టీజీవోస్ భవన్లో నిర్వహించనున్న టీజీవోస్ బతుకమ్మ వేడుకలకు మహిళా ఐఏఎస్ ఉన్నతాధికారులను ఆహ్వానించారు.
స్పెషల్ చీఫ్ సెక్రటరీ వాణి ప్రసాద్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా, స్పెషల్ సెక్రటరీ (ఫైనాన్స్) సిక్తా పట్నాయక్‌లను టీజీవోస్ ప్రతినిధులు కలిసి వేడుకలకు ఆహ్వానించారు.
టీజీవోస్ సెంట్రల్ అసోసియేషన్ మహిళా విభాగం చైర్పర్సన్ డాక్టర్ దీపా రెడ్డి, కన్వీనర్ సెక్రటరీ జె. సుజాత, సెంట్రల్ అసోసియేషన్ సెక్రటరీ శిరీష, చైర్పర్సన్ అనిత తదితరులతో పాటు మమత, వందన, జయశ్రీ, సరస్వతి, ఝాన్సీ, కీర్తి, ఆశన్న, రాజేందర్, వెంకట్ రామరెడ్డి పాల్గొన్నారు. టీజీవో హైదరాబాద్ అధ్యక్షుడు కృష్ణ యాదవ్, హైదరాబాద్ సిటీ అధ్యక్షుడు వెంకట్ గండూరి ఆధ్వర్యంలో మహిళా ఉన్నతాధికారులకు ఆహ్వానం అందజేశారు.
ఈ బతుకమ్మ సంబరాలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.




