రూ.20 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, మండల సర్వేయర్!
భూమి పనికి లంచం డిమాండ్.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ అధికారులు
రంగారెడ్డి, అక్టోబర్ 13 (విజయ కెరటం):
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలో రూ.20 లక్షల లంచం తీసుకుంటుండగా ఇద్దరు ప్రభుత్వ అధికారులు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డారు. మండల సర్వేయర్ బతుక శ్రీనివాసులు, తహసీల్దార్ బి. సుదర్శన్ రెడ్డి కలిసి భూమికి సంబంధించిన పనిని పూర్తి చేసేందుకు ఫిర్యాదుదారుడి నుంచి రూ.20 లక్షలు డిమాండ్ చేసినట్లు సమాచారం.
ఈ వ్యవహారంపై సమాచారం అందుకున్న ఏసీబీ సిటీ రేంజ్–సీఐయూ అధికారులు దాడి చేసి, లంచం సొమ్ము తీసుకుంటున్న సమయంలో ఇద్దరినీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు వెల్లడించారు. వారి నుంచి రూ.20 లక్షల లంచం సొమ్మును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.
ఈ ఘటనపై ఏసీబీ అధికారులు తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ పనుల కోసం లంచాలు డిమాండ్ చేసే అధికారులపై ఏసీబీ చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఈ ఘటన జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.




