12వ బెటాలియన్ అన్నెపర్తిలో ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం
నల్గొండ, అక్టోబర్ 21 (విజయ కెరటం):
నల్గొండ జిల్లా అన్నెపర్తిలోని 12వ బెటాలియన్లో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బెటాలియన్ కమాండెంట్ బి. రామకృష్ణ అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్ఛం సమర్పించి విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసులకు నివాళులర్పించారు.
అనంతరం అసిస్టెంట్ కమాండెంట్ నర్సింగు వెంకన్న గత ఏడాది కాలంలో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన 154 మంది పోలీస్ అమరవీరుల పేర్లను చదివి వినిపించారు. ఆర్ఎస్ఐ రమేష్ ఆధ్వర్యంలో పరేడ్ కంటింజెంట్ స్మృతి పరేడ్ నిర్వహించి అమరవీరులకు గౌరవ వందనం సమర్పించింది.
ఈ సందర్భంగా కమాండెంట్ బి. రామకృష్ణ మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న దేశవ్యాప్తంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహిస్తూ, దేశ రక్షణతో పాటు ప్రజల భద్రత కోసం ప్రాణత్యాగం చేసిన పోలీసుల సేవలను స్మరించుకుంటామని తెలిపారు. అమరవీరుల త్యాగాలను ప్రజలకు తెలియజేసేందుకు వారం రోజులపాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా రక్తదాన శిబిరం, సైకిల్ ర్యాలీ, షార్ట్ ఫిలిం, ఫోటోగ్రఫీ, వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కమాండెంట్ ఎల్. నాగేశ్వరరావు, అసిస్టెంట్ కమాండెంట్లు కె. మహేందర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ దయాకర్, యూనిట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఆర్. షర్మిలా దేవి, నితిన్ గౌతమ్, ఆర్ఐలు, ఆర్ఎస్ఐలు, హోంగార్డులు, నాలుగో తరగతి ఉద్యోగులు, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొ
న్నారు.




