Monday, November 23, 2026
Homeఎన్ఆర్ఐఅమెరికాలో రోడ్డు ప్రమాదంలో మునుగోడు యువకుడు మృతి.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంతాపం

అమెరికాలో రోడ్డు ప్రమాదంలో మునుగోడు యువకుడు మృతి.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంతాపం

📰 Generate e-Paper Clip

అమెరికాలో రోడ్డు ప్రమాదంలో మునుగోడు యువకుడు మృతి.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంతాప

నల్గొండ, నవంబర్ 21 (విజయ కెరటం): ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి, ఇటీవలే ఉద్యోగం సాధించి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకున్న నల్గొండ జిల్లా మునుగోడుకు చెందిన సాయితేజ (25) రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం తనను తీవ్రంగా కలిచివేసిందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

వారం రోజుల క్రితమే ఉద్యోగం సాధించాడన్న శుభవార్తతో సంతోషంగా ఉన్న తల్లిదండ్రులకు, ఇంతలోనే కుమారుడి మరణవార్త వినాల్సి రావడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. ఈ విషాద సమయంలో సాయితేజ కుటుంబ సభ్యులకు మంత్రి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సాయితేజ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

App Icon

Install VK News App

Add to home screen for faster loading and latest updates.