Monday, November 23, 2026
Homeతెలంగాణరీ సర్వే పనుల పరిశీలనకు బైక్‌పై వెళ్లిన కలెక్టర్

రీ సర్వే పనుల పరిశీలనకు బైక్‌పై వెళ్లిన కలెక్టర్

📰 Generate e-Paper Clip

రీ సర్వే పనుల పరిశీలనకు బైక్‌పై వెళ్లిన కలెక్టర

**క్షేత్రస్థాయిలో పనుల పురోగతిపై ప్రత్యేక దృష్టి – తేజస్ నందలాల్ పవార్**

**సూర్యాపేట (విజయ కెరటం స్టేట్ బ్యూరో – గౌస్):** క్షేత్రస్థాయిలో అభివృద్ధి, ప్రభుత్వ పథకాల అమలు, రెవెన్యూ పనుల పురోగతిని స్వయంగా పరిశీలించేందుకు జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఇందులో భాగంగా నూతనకల్ మండలం దిర్శనపల్లి గ్రామంలో రీ సర్వే పనులను పరిశీలించేందుకు కారు వెళ్లే మార్గం లేకపోవడంతో బైక్‌పై వెళ్లి అధికారులను ఆశ్చర్యపరిచారు.

గ్రామంలో ఇందిరమ్మ కుటుంబ బీమా యోజన పథకాన్ని ప్రారంభించిన అనంతరం అదే గ్రామంలో జరుగుతున్న భూముల రీ సర్వే పనులను పరిశీలించేందుకు కలెక్టర్ వెళ్లారు. అయితే సర్వే ప్రాంతానికి కారు వెళ్లేందుకు అవకాశం లేకపోవడంతో అక్కడే ఉన్న ద్విచక్రవాహనంపై తహసీల్దార్ శ్రీనివాసులుతో కలిసి సర్వే ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ జరుగుతున్న పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

దిర్శనపల్లి గ్రామంలో మొత్తం 1,240 ఎకరాల భూమికి గాను ఇప్పటివరకు 800 ఎకరాల్లో రీ సర్వే పూర్తయినట్లు తహసీల్దార్ కలెక్టర్‌కు వివరించారు. మిగిలిన పనులను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. రీ సర్వే ప్రక్రియలో రైతులను భాగస్వాములను చేస్తూ, వారి సహకారంతో పారదర్శకంగా సర్వే నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో మండల సర్వేయర్లు, పంచాయతీ కార్యదర్శి, రైతులు తదితరులు పాల్గొ

న్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

App Icon

Install VK News App

Add to home screen for faster loading and latest updates.