Monday, November 23, 2026
Homeతెలంగాణమైనారిటీ విద్యార్థులకు ఉచిత టెట్ కోచింగ్

మైనారిటీ విద్యార్థులకు ఉచిత టెట్ కోచింగ్

📰 Generate e-Paper Clip

మైనారిటీ విద్యార్థులకు ఉచిత టెట్ కోచింగ

డిసెంబర్ 1 నుంచి తరగతులు ప్రారంభం.. నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ

నల్గొండ, నవంబర్ 20 (విజయ కెరటం): మైనారిటీ విద్యార్థులకు శుభవార్త. తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TG TET–2026)కు సిద్ధమయ్యే మైనారిటీ విద్యార్థుల కోసం నల్గొండలోని ఇడారా-ఏ-ఇఖామత్ ఖానా బహదూర్ ఖాన్ ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ నిర్వహించనున్నారు. ఈ శిక్షణ తరగతులు డిసెంబర్ 1 నుంచి ప్రారంభం కానున్నాయి.

ఉచిత కోచింగ్ పొందాలనుకునే విద్యార్థులు నవంబర్ 20 నుంచి ఇడారా కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని నిర్వాహకులు తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. నల్గొండలోని మాన్యంచల్క వద్ద జిల్లా జైలు పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న ఇడారా కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలి.

డిసెంబర్ 1 నుంచి ప్రారంభమయ్యే తరగతులు ప్రతిరోజూ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు కొనసాగుతాయి. మరిన్ని వివరాలకు ఇడారా అధ్యక్షుడు మహమ్మద్ షాహిద్ అహ్మద్ (9912214835), కార్యదర్శి మహమ్మద్ షఫీ నవాజ్ ఖాన్ (9052342745), కార్యాలయ ఇన్‌చార్జి (9398667017)ను సంప్రదించాలని నిర్వాహకులు సూ

చించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

App Icon

Install VK News App

Add to home screen for faster loading and latest updates.