నల్లగొండ ఇంచార్జి కమిషనర్‌గా శ్రీజా రెడ్డి బాధ్యతల స్వీకర
నల్లగొండ, నవంబర్ 19 (విజయ కెరటం): నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ ఇంచార్జి కమిషనర్‌గా శ్రీజా రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సొంత జిల్లాలో పనిచేసే అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు. నల్లగొండ నగర అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, విధులను బాధ్యతాయుతంగా నిర్వహిస్తానని తెలిపారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానన్నారు. నల్లగొండ నగరంపై తనకు ఇప్పటికే అవగాహన ఉందని పేర్కొన్నారు. నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తానని ఇంచార్జి కమిషనర్ శ్రీజా రెడ్డి వెల్లడించారు
.

