Sunday, November 22, 2026
Homeతెలంగాణనాణ్యతతో అభివృద్ధి పనులు చేపట్టాలి.. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలి

నాణ్యతతో అభివృద్ధి పనులు చేపట్టాలి.. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలి

📰 Generate e-Paper Clip

నాణ్యతతో అభివృద్ధి పనులు చేపట్టాలి.. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాల

నల్లగొండ, నవంబర్ 18 (విజయ కెరటం): నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 2, 18, 19, 22వ డివిజన్లలో చేపట్టిన అభివృద్ధి పనులను మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి బుధవారం స్థానిక కార్పొరేటర్లతో కలిసి పరిశీలించారు. ఆయా డివిజన్లలో నూతనంగా నిర్మించిన సీసీ డ్రైనేజీలు, బీటీ రోడ్ల పనుల నాణ్యతను తనిఖీ చేసి, పనుల పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

18వ డివిజన్‌లో ఎన్‌హెచ్ డ్రైనేజీలు, విద్యుత్ స్తంభాలను కూడా పరిశీలించారు. నగర ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు మేయర్ తెలిపారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని అధికారులకు సూచించారు. పారిశుద్ధ్యం, డ్రైనేజీ వ్యవస్థ, రహదారుల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మహమ్మద్ అష్రఫ్ అలీ అమేర్, కార్పొరేటర్లు ఇబ్రహీం, సమద్, నల్లగొండ పీఏసీఎస్ చైర్మన్ ఆలకుంట్ల నాగరత్నం రాజు, గోగుల గణేష్, ఆలకుంట్ల నాగరాజు, పల్ రెడ్డి వెంకట్ రెడ్డి, గుండబోయిన యాదయ్య, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నా

రు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

App Icon

Install VK News App

Add to home screen for faster loading and latest updates.