Monday, October 26, 2026
Google search engine
Homeతెలంగాణకనగల్ చెరువులో మునిగి వ్యక్తి మృతి భార్య, పిల్లల కళ్లెదుటే విషాదం.. ఈతకు వెళ్లి ప్రాణాలు...

కనగల్ చెరువులో మునిగి వ్యక్తి మృతి భార్య, పిల్లల కళ్లెదుటే విషాదం.. ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి

📰 Generate e-Paper Clip

కనగల్ చెరువులో మునిగి వ్యక్తి మృతి

 

భార్య, పిల్లల కళ్లెదుటే విషాదం.. ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి

నల్గొండ, అక్టోబర్ 13 (విజయ కెరటం):

 

కుటుంబంతో సరదాగా గడిపేందుకు చెరువు వద్దకు వెళ్లిన ఓ వ్యక్తి నీటిలో మునిగి మృతి చెందాడు. ఈ విషాద ఘటన మంగళవారం మధ్యాహ్నం కనగల్ చెరువు వద్ద చోటుచేసుకుంది.

 

కనగల్ ఎస్సై కే. రాజీవ్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ పట్టణానికి చెందిన మహమ్మద్ అమ్మద్ అలీఖాన్ (38) సౌదీ అరేబియాలో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం భార్య, పిల్లలతో కలిసి కనగల్ చెరువు వద్దకు వచ్చాడు. నీటి లోతును అంచనా వేయకుండా ఈత కొట్టేందుకు చెరువులోకి దిగాడు. అయితే ఈత రాకపోవడంతో ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు.

 

అతడు నీటిలో మునిగిపోవడాన్ని గమనించిన భార్య, పిల్లలు కేకలు వేయడంతో సమీపంలోని రైతులు వెంటనే అక్కడికి చేరుకుని అతడిని బయటకు తీశారు. అయితే అప్పటికే అతడు మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. కుటుంబ సభ్యుల కళ్లెదుటే ఈ ఘటన చోటుచేసుకోవడంతో తీవ్ర విషాదం నెలకొంది.

 

చెరువులు, నీటి వనరుల్లోకి దిగేటప్పుడు నీటి లోతుపై అవగాహన లేకుండా ఈతకు వెళ్లవద్దని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

App Icon

Install VK News App

Add to home screen for faster loading and latest updates.