29 C
Hyderabad
Wednesday, September 16, 2026
Homeతెలంగాణఐద్వా రాష్ట్ర నాయకురాలు సుమతి కన్నుమూత.. వైద్య కళాశాలకు పార్థివదేహం
Advertisement spot_img

ఐద్వా రాష్ట్ర నాయకురాలు సుమతి కన్నుమూత.. వైద్య కళాశాలకు పార్థివదేహం

Must read

మహబూబ్‌నగర్, ఆగస్టు 25: ఐద్వా రాష్ట్ర నాయకురాలు, సీపీఎం జాతీయ నాయకుడు మధు సతీమణి కామ్రేడ్ సుమతి సోమవారం రాత్రి కన్నుమూశారు. ఆమె కోరిక మేరకు కుటుంబ సభ్యులు పార్థివదేహాన్ని మహబూబ్‌నగర్ వైద్య కళాశాలకు అప్పగించారు.

సుమతి పార్థివదేహానికి సీపీఎం జాతీయ పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్‌రెడ్డి సహా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు.

సుమతి పార్టీ, ప్రజా ఉద్యమాల కోసం జీవితాంతం సేవ చేశారని బీవీ రాఘవులు కొనియాడారు. మరణానంతరం కూడా తన దేహం వైద్య విద్యకు ఉపయోగపడేలా దానం చేయడం ఆమె త్యాగనిరతికి నిదర్శనమన్నారు. సుమతి జీవితం భావితరాలకు స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -spot_img

More articles

Latest article

App Icon

Install VK News App

Add to home screen for faster loading and latest updates.