29 C
Hyderabad
Wednesday, September 16, 2026
Homeతెలంగాణనల్గొండ గౌడ సంఘానికి నూతన నాయకత్వం.. ఏకగ్రీవంగా జిల్లా కమిటీ ఎన్నిక
Advertisement spot_img

నల్గొండ గౌడ సంఘానికి నూతన నాయకత్వం.. ఏకగ్రీవంగా జిల్లా కమిటీ ఎన్నిక

Must read

నల్గొండ, ఆగస్టు 25: తెలంగాణ గౌడ సంఘం నల్గొండ జిల్లా నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. మంగళవారం నల్గొొండ జిల్లా కేంద్రంలోని దేవరకొండ రోడ్డులో ఉన్న జీఎల్ గార్డెన్‌లో జిల్లా గౌడ సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు నకరికంటి కాశయ్య గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి గౌడ సంఘం నాయకులు, సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్ గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరుకాగా, రాష్ట్ర కోశాధికారి రవి గౌడ్‌తో పాటు పలువురు రాష్ట్ర స్థాయి బాధ్యులు పాల్గొన్నారు. జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన కార్యవర్గ సభ్యులు, గౌడ సంఘం నాయకులు, సభ్యులు కలిపి సుమారు 300 మంది సమావేశానికి హాజరయ్యారు.

సమావేశంలో నూతన జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా నకరికంటి కాశయ్య గౌడ్, ప్రధాన కార్యదర్శిగా పుల్లెంల శ్రీనివాస్ గౌడ్, గౌరవ అధ్యక్షుడిగా పొన్నం లక్ష్మయ్య ఎన్నికయ్యారు.

నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులకు రాష్ట్ర అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్ గౌడ్ చేతుల మీదుగా నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా నూతన కమిటీకి నాయకులు అభినందనలు తెలిపారు. గౌడ సంఘాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు, గౌడ కులస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేయాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో పుల్లెంల అచ్చాలు గౌడ్, వడ్డేపల్లి గోపాల్ గౌడ్, ఆకునూరి నారాయణ గౌడ్, కొన్నె శంకర్ గౌడ్, సైదులు గౌడ్, జెరిపోతుల శంకర్ గౌడ్, ఇతగోని వెంకటేశ్వర్లు, సురిగి యాదగిరి, కొప్పు కృష్ణ, వేముల నర్సింహ, సత్యం, ఎం. సైదులు, జి. కృష్ణ, లాలయ్య, బండారి గోవర్ధన్, యరుకలి శంకర్ గౌడ్ తదితర గౌడ సంఘం పెద్దలు, నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img

More articles

Latest article

App Icon

Install VK News App

Add to home screen for faster loading and latest updates.