25.7 C
Hyderabad
Wednesday, September 16, 2026
Homeతెలంగాణపుట్టినరోజు వేడుకలు పక్కనపెట్టి.. మృతుడి కుటుంబానికి అండగా మాజీ ఎమ్మెల్యే
Advertisement spot_img

పుట్టినరోజు వేడుకలు పక్కనపెట్టి.. మృతుడి కుటుంబానికి అండగా మాజీ ఎమ్మెల్యే

Must read

నల్లగొండ: ఫ్లెక్సీ కడుతూ విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందిన కేసాని రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అండగా నిలిచారు. పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండి.. బాధిత కుటుంబానికి ఇచ్చిన మాటను 24 గంటల్లోనే నిలబెట్టుకున్నారు.

కట్టా అన్నారంలో రాజశేఖర్ రెడ్డి అంత్యక్రియలకు హాజరైన భూపాల్ రెడ్డి.. పార్థివదేహానికి నివాళులర్పించారు. అనంతరం విషాదంలో ఉన్న కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. “నేనున్నాను.. అధైర్యపడొద్దు” అంటూ వారికి భరోసా కల్పించారు.

మృతుడికి మూడున్నరేళ్ల కుమారుడు, ఏడాది వయసున్న కుమార్తె ఉన్న విషయం తెలుసుకుని భూపాల్ రెడ్డి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. పిల్లల భవిష్యత్తుకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

రాజును తిరిగి తీసుకురాలేం.. కానీ అతని పిల్లల భవిష్యత్తుకు అండగా ఉంటాం” అని పేర్కొంటూ.. మృతుడి కుమారుడు, కుమార్తె పేర్లపై చెరో రూ.4 లక్షల చొప్పున మొత్తం రూ.8 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేయించారు. అందుకు సంబంధించిన పత్రాలను కుటుంబ సభ్యులకు అందజేశారు.

అంతేకాకుండా కార్యకర్తల సహకారంతో ఫోన్‌పే, గూగుల్‌పే ద్వారా కూడా బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు.

రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి కష్ట సమయంలో అండగా నిలిచిన భూపాల్ రెడ్డి నిర్ణయంపై స్థానికంగా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. మాట ఇస్తే నిలబెట్టుకోవడమే కాకుండా.. ఆపదలో ఉన్న కుటుంబానికి భరోసాగా నిలిచారంటూ పలువురు పేర్కొంటున్నారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎం.సి. కోటిరెడ్డి, రాష్ట్ర పార్టీ నాయకులు కంచర్ల కృష్ణారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షులు రేగట్టె మల్లికార్జున రెడ్డి, నల్లగొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, గోన రవీందర్ రావు, నగర పార్టీ అధ్యక్షులు బోనగిరి దేవేందర్, కనగల్ నల్లగొండ మండల పార్టీ అధ్యక్షులు ఐతగోని యాదయ్య, దేప వెంకటరెడ్డి, కార్పొరేటర్లు మారగోని గణేష్, రావుల శ్రీనివాస్ రెడ్డి, జహంగీర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img

More articles

Latest article

App Icon

Install VK News App

Add to home screen for faster loading and latest updates.