25.2 C
Hyderabad
Thursday, September 17, 2026
Homeతెలంగాణజగిత్యాలజగిత్యాల జిల్లాలో యువతిపై సామూహిక అత్యాచారం.. నలుగురు అరెస్ట్
Advertisement spot_img

జగిత్యాల జిల్లాలో యువతిపై సామూహిక అత్యాచారం.. నలుగురు అరెస్ట్

Must read

యువతి వీడియోలు తీసి బెదిరింపులు.. ఇద్దరిపై అత్యాచారం ఆరోపణలు

జగిత్యాల జిల్లాలో యువతిపై సామూహిక అత్యాచారం జరిగినట్లు పోలీసులు తెలిపారు. మల్యాల మండలం నూకపల్లి గ్రామ శివారులోని డబుల్ బెడ్‌రూం ఇళ్లలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం.

నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ యువతి తనకు పరిచయం ఉన్న వ్యక్తిని కలిసేందుకు అక్కడికి వెళ్లింది. అదే సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన నలుగురు వ్యక్తులు యువతి వీడియోలు తీసి, వాటిని సోషల్ మీడియాలో పెడతామని బెదిరించి బ్లాక్‌మెయిల్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

పోలీసుల వివరాల ప్రకారం.. గుర్రం శ్రీకాంత్ (29), శివరాత్రి నరేష్ (38) యువతిపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. గుర్రం అంజయ్య (35), మారేవేని మల్లేశ్ (28) బయట ఉండి కాపలా కాసినట్లు పోలీసులు తెలిపారు.

బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుల్లో కొందరిపై గతంలో రౌడీషీట్లు, ఇతర క్రిమినల్ కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

- Advertisement -spot_img

More articles

Latest article

App Icon

Install VK News App

Add to home screen for faster loading and latest updates.