మేళ్లచెరువులో ముస్లిం సంప్రదాయ పద్ధతుల్లో అంత్యక్రియలు
నల్లగొండ, ఆగస్టు 31:
బీఆర్‌ఎస్ పార్టీ నల్లగొండ నగర కార్యదర్శి, సయ్యద్ జాఫర్ సతీమణి నిన్న మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె అంత్యక్రియలను సోమవారం వారి స్వగ్రామమైన మేళ్లచెరువులో ముస్లిం సంప్రదాయ పద్ధతుల ప్రకారం నిర్వహించారు.
ఈ అంత్యక్రియలకు నల్లగొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి హాజరై, సయ్యద్ జాఫర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతురాలి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, బంధువులు, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానికులు పాల్గొని ఆమెకు తుదివీడ్కోలు పలికారు.


