నల్లగొండ, ఆగస్టు 30 (విజయ కెరటం ప్రతినిధి):
టీఆర్‌ఎస్ నల్లగొండ పట్టణ కార్యదర్శి, సయ్యద్ జమాల్ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ చైర్మన్ అండ్ కరస్పాండెంట్ సయ్యద్ జాఫర్ సతీమణి శనివారం ఉదయం బ్రెయిన్ స్ట్రోక్‌తో మృతి చెందారు.
విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి నల్లగొండలోని వారి నివాసానికి వెళ్లి మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం సయ్యద్ జాఫర్ కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.


