29 C
Hyderabad
Wednesday, September 16, 2026
HomeతెలంగాణNEET-PG పరీక్షకు పటిష్ట బందోబస్తు
Advertisement spot_img

NEET-PG పరీక్షకు పటిష్ట బందోబస్తు

Must read

నల్లగొండ, ఆగస్టు 29 (విజయ కెరటం):

నల్లగొండలో ఆగస్టు 30న నిర్వహించనున్న NEET-PG-2026 పరీక్షకు పటిష్టమైన పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ శరత్‌ చంద్ర పవార్‌ ఐపీఎస్‌ తెలిపారు.

NEET-PG పరీక్షకు పటిష్టమైన పోలీస్ బందోబస్తు – పరీక్ష కేంద్రాల వద్ద 200 మీటర్ల పరిధిలో సెక్షన్ 163 BNSS అమలు: జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్

నల్లగొండ జిల్లా పరిధిలో నిర్వహించనున్న NEET (PG)-2026 పరీక్షల సందర్భంగా పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ ఒక ప్రకటనలో తెలిపారు.

నల్లగొండ పట్టణ పరిధిలో తేదీ 30-08-2026 ఆదివారం SPR స్కూల్, నెతాజీ నగర్, రామగిరి లో నిర్వహించనున్న నల్లగొండ పరీక్షా కేంద్రం చుట్టూ 200 మీటర్ల పరిధిలో సెక్షన్ (144)163 BNSS, 2023 అమలులో ఉంటుందని ఎస్పీ తెలిపారు.

పరీక్ష ఉదయం 9:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు నిర్వహించబడనున్న నేపథ్యంలో పరీక్ష కేంద్రాల వద్ద ఉదయం నుంచే పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి, పరీక్ష సజావుగా జరిగేలా అన్ని ముందస్తు చర్యలలో భాగంగా పరీక్షా కేంద్రం చుట్టుపక్కల కమ్యూనికేషన్ ఆటంకం ఏర్పడే అవకాశం ఉంటుందని కావున ముందస్తు జాగ్రత్తలు తీసుకోగలరని పేర్కొన్నారు.

పరీక్షలు ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నిర్వహించేందుకు ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో ఉదయం 6.00 గంటల నుంచి సాయంత్రం 6.00 గంటల వరకు సెక్షన్ (144) 163, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (BNSS) అమలులో ఉంటుందని తెలిపారు.

ఈ నేపథ్యంలో పరీక్షా కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో ఐదుగురికి మించి గుంపులుగా ఉండరాదని సూచించారు. అదేవిధంగా ఎలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలు, ప్రచార కార్యక్రమాలు నిర్వహించరాదని తెలిపారు. మైకులు, డీజేలు ఉపయోగిస్తూ ఉరేగింపులు నిర్వహించడంపై కూడా నిషేధం ఉంటుందని పేర్కొన్నారు.

పరీక్షల సమయంలో ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఉండేందుకు పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లోని ఇంటర్నెట్ సెంటర్లు, జిరాక్స్ షాపులు, స్టేషనరీ దుకాణాలను మూసివేయాలని సంబంధిత యాజమాన్యాలను సూచించారు.

పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీస్ బందోబస్తుతో పాటు పరీక్షా కేంద్రం వద్ద ఎటువంటి ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ట్రాఫిక్ పోలీసులతో ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో పోలీస్ పెట్రోలింగ్ పార్టీలను నియమించి నిరంతర నిఘా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

NEET (PG)-2026 పరీక్షలను ప్రశాంతంగా, సజావుగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ అన్ని విధాలుగా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టిందని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ తెలిపారు.

- Advertisement -spot_img

More articles

Latest article

App Icon

Install VK News App

Add to home screen for faster loading and latest updates.