29 C
Hyderabad
Wednesday, September 16, 2026
Homeతెలంగాణక్రైమ్‌ పారామీటర్ల అమలులో నల్లగొండ పోలీసుల సత్తా
Advertisement spot_img

క్రైమ్‌ పారామీటర్ల అమలులో నల్లగొండ పోలీసుల సత్తా

Must read

నల్లగొండ, ఆగస్టు 29 (ఉమ్మడి జిల్లా ప్రతినిధి, విజయ కెరటం):

క్రైమ్‌ పారామీటర్ల అమలు, పోలీస్‌ శాఖ పనితీరులో నల్లగొండ జిల్లా పోలీస్‌ శాఖ ఉత్తమ ప్రతిభ కనబరిచింది. రాష్ట్రంలోని వివిధ పోలీస్‌ యూనిట్ల పనితీరుపై నిర్వహించిన సమీక్షలో 8 కీలక అంశాల్లో సమగ్ర పనితీరు ఆధారంగా నల్లగొండ జిల్లా క్లస్టర్‌-3లో ప్రథమ స్థానాన్ని సాధించింది.

ఈ సందర్భంగా నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్‌ చంద్ర పవార్‌కు రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్‌ శనివారం ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు. జిల్లా పోలీస్‌ అధికారులు, సిబ్బంది సమష్టి కృషి, అంకితభావంతో విధులు నిర్వహించి ఉత్తమ ఫలితాలు సాధించడాన్ని డీజీపీ ప్రశంసించారు.

ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ భవిష్యత్తులోనూ మరింత సమర్థవంతంగా విధులు నిర్వహించి, అన్ని రంగాల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని డీజీపీ సీవీ ఆనంద్‌ జిల్లా పోలీస్‌ అధికారులకు, సిబ్బందికి సూచించారు.

నల్లగొండ జిల్లా పోలీస్‌ శాఖ సాధించిన ఈ విజయంపై ఎస్పీ శరత్‌ చంద్ర పవార్‌ హర్షం వ్యక్తం చేశారు. ఈ ఘనత సాధించేందుకు కృషి చేసిన జిల్లా పోలీస్‌ అధికారులు, సిబ్బంది, ప్రత్యేక బృందాలందరికీ ఆయన అభినందనలు తెలిపారు.

- Advertisement -spot_img

More articles

Latest article

App Icon

Install VK News App

Add to home screen for faster loading and latest updates.